STORYMIRROR

ARJUNAIAH NARRA

Action

2  

ARJUNAIAH NARRA

Action

శ్రమ జీవుల పండుగలు

శ్రమ జీవుల పండుగలు

1 min
231

తొలి ఏకాదశి నుండి దీపావళి వరకు

ఉత్తరాయణం నుండి దక్షిణయానం వరకు

లేదంటే వరలక్ష్మి వ్రతం, గణేష్ చతుర్థి,

పితృ అమావాస్య, దసరా, దీపావళి, 

సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, శ్రీ రామనవమి....


మనం మన మూలలను మరిచిపోయి

మూల సంస్కృతిని వీడి పరాయికరించబడ్డం

ఎటు వైపు నీ ప్రయాణం .......

ఎప్పటి వరకు ఈ మతతత్వం

ఎందుకంత అలసత్వం

తెంపుకోవ నీ బానిసత్వం....

ఎన్నాళ్లీ అంధత్వం

తెరుచుకోదా నీ నయనం

మూలవాసుల మరణం పర్వదినమా నీకు?


తరాలు గడుస్తున్న

తరతరాలు పీడిస్తున్న

మత క్రతువులతో 

బతుకుల్ని నెట్టుకొస్తున్నాం 

పిల్లలలో నమ్మకాలని నూరి పోస్తు

పరాజితుల సంస్కృతి పునాదుల్ని విస్మరిస్తు

మన మూల నివాసుల మూలాల్ని మరిచిపోతున్నాం


ఊరి చివర, పొలం గట్టు, చెరువు కట్టలు కాదా

మన స్వయంభూ దేవుళ్ళు, దేవతలు 

బోనంసాక పట్టి భోజనంబులు బెట్టి 

బతుకు గోడు వెళ్ళబెట్టి 

బోనాలతో పండుగలుచేసి

నిలువెత్థు నీరాజనాలు పలుకలేదా?


మమ్ము కాపాడే మహంకాలమ్మ ,

మేలుకోరే ముత్యాలమ్మ, కాపు కాసే పోచమ్మ, 

ఇంజనీరు మైసమ్మ, మంచి కోరే మారమ్మ , 

ఎలుకోనే ఎల్లమ్మ, డాక్టర్ అంకాలమ్మ, పెద్దమ్మ,

బతుకమ్మ, పోలేరమ్మ, పోతరాజు పండుగలేవి?

శ్రమజీవుల పండుగల సంస్కృతిలో

భూమి తల్లిని మొక్కనిదే మొక్కయిన మొలవుదు

కష్టపడి దున్ననిదే పిడికెడు మెతుకులైన పుట్టవు


అమ్మ తల్లి సంస్కృతిని 

లక్ష్మీ, పార్వతి, సరస్వతుల 

పురాణ కథలతో పులిమినా, 

దేవి,గణేష్ నవ రాత్రులు జరిపిన

నేతి దీపాలు,హోమాలు,పూజలు, 

వ్రతాలు, దద్దోజనాలు, నైవేద్యాలు, 

పట్టు చీనాంబరాలు పెట్టిన,  

మన గుడిసెలోకి మీ సంపదల దేవతలు 

లక్ష్మీ, వరలక్ష్మి లు తొంగి చూడనే చూడరు


పూతన, తాటక, లంకిణిని హతమార్చిన

మాతృసౌమ్య వ్యవస్థను మాయం చేసిన 

పితృసౌమ్య వ్యవస్థను పుట్టించిన

మూలవాసుల చరిత్రని వక్రీకరించిన

మా నేలన మా సంస్కృతి మాయమవ్వదు



Rate this content
Log in

Similar telugu poem from Action