సహో దుమాశకటమా!
సహో దుమాశకటమా!


తెల తెల వారంగా
తెల్లారి జాముల్ల
అల అప్పుడే లేచిన కోడి కొక్కో అంటూ
ఎర్రని సూర్యుడ్ని లేపిన ఆ అందమైన ఉదయం లో
అల నా దారి లో నడుస్తూ కల్లాపు జల్లుతూ మాతల ముగ్గులట
ఉదయాన్నే అలల శబ్దం లా తాకిన చల్లని చిగురు గాలి కి
శుభోదయం అంటూ ప్రయాణం అయిన కంటికి కనుల విందు గా
స్వాగతించిన ఆ దుమాశకట ప్రయాణ ప్రాంగణము...
ప్రస్థాన త్రయం లో
ప్రశాంతంగా కనిపిస్తూ
పనికై,శ్రమికకై,విద్య కై
నానా విధ లఘు విధాలుగా...!
పలకరిస్తూ
ధూమాశకట కూతల్లో హోరెత్తిన
గుండెల పదిల ప్రయాణ పదనిస
లు ఎన్నో ఎన్నోన్నో...
పచ్చని పైరుల నడుమ సాగతున్న ఆ ధూమషకటం
ప్రకృతి అందాలను మరింత ఆస్వాదించే లా..
ప్రయాణం సాగిస్తూ.
అందరి నీ గమ్యలకు చేరుస్తూ...
ఇంటికి క్షేమంగా చేరుస్తూ..
అలుపు లేని ప్రయాణం సాగిస్తూన్న
పొట్టకూటి కోసం పరిగెత్తే జనం మధ్య
తల్లి గర్భంలో తనయ కోసం
కీచురాళ్ళ సముద్రపు చప్పుడు
తో పోటీగా
కొండల నడుమ ఎర్రని సూర్యుడు...
వెచ్చగా వేస్తున చల్లని గాలి కంటే వేగంగా...
ఓ ధూమశకటమా
వందనం..!
అభివందనం...!
సాహో
దుమశకటమా..!