కన్నీటి భాషాప్నoజలి
కన్నీటి భాషాప్నoజలి
ప్రతి వాక్యం కవిత కోసమే రాయరు ఎవరు...!
కవి అన్నా వారు
బాధల్ని,బంధాల్ని
తెంచుకుని తాను ఒంటరి నీ...?!?
ఏ కాకి గా మిగిలిన ఆ క్షణం పలికే పదనిసలు మధ్య పవళించే రాగాల పేగుబంధం,మూడు ముళ్ళ బంధం, స్నేహబంధం లేనపుడు
తనకుతానే
జీవితాన్ని ఉరి గా మార్చుకుని.!!
చావు కై ఎదురు చూస్తూ!!
సెలవు తీసుకుంటూ!!
ఒక్కక్కరిగా అందరిని కలుస్తూ..
ఊపిరి వదిలిన ఆ క్షణమే.
సంతోషం అనుకోవడం!!
ఇక సెలవు
మళ్ళీ వస్తానో లేదో
మళ్ళీ పలుకుతానో లేదో
అంటూ
కవి గా,మనిషి కూడా
సెలవు ప్రకటించిన..
ఆ మహాయోదుడు
ఇది నా కన్నీటి భాషాప్నoజలి!!!
