పద జవళిక
పద జవళిక
ప్రస్తుత తక్షణ పరిస్థితుల్లో
కొట్టు మిట్టు లాడుతున్న...
ఓ భయంకర నిజామా!!
బయటకి వచ్చేదెలా!!
ఉప్పెనై తాకేదెల!!
ముంచుకొస్తున్న ప్రళయమా!!!
చిరకాల మిత్రమా!
ప్రయాణం చేసే జీవిత భాగస్వామివా!
అంతం అయ్యే సమయం రానే వచ్చింది!
దాటి బయట పడేనా!
సంద్రం లో మునిగి పోయినా!!
ఇక ఈశ్వరెచ్చ !!!హర హర!!
ఇంకా పూర్తి గాని బంధమా!
వదులుకోలేని అనుబంధమా!!
కన్నీటి సంబంధమా!!
కడతేరే క్షణం ఆసన్నం అయింది
అంటూ ఆకాశవాణి పలికిన స్వాగతపు ఆహ్వానామా!!
యముడు విసిరిన యమపాశపు తోరణమా!
ఇట్లు
కవి రాసిన చివరి
పద జవళిక!!!
