STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Inspirational

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Inspirational

సైనికా నీకు సలాం 👏

సైనికా నీకు సలాం 👏

1 min
656


లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇనుప బూట్ల శబ్దాలు

ధభేల్.. ఢమాల్.. ఢమాల్ బాంబుల మోతలెప్పుడొచ్చినా సిద్ధపడిన గుండె

నింపుకున్న ధైర్యం నీ స్థైర్యం 

ఓ సైనికా...!

పగలు రేయి ఎండా వానా ఒక్కటిగా

దేశ రక్షణే ధ్యేయంగా 

కాలమంతా గుప్పిట దాచి

చర్మం చీల్చే చలిలో

గుండెలు మండే వేసవిలో 

నీ అన్నవారిని పర్స్ జేబులో దాచేసి

శత్రువులను మట్టుబెట్ట ముష్కురుల రూపు మాప 

మా కోసం ప్రాణాలు పణంగా పెట్టే 

ఓ సైనికా...!! 

ఎల్లల్లో ఎల్లకాలం కాలం వెళ్ళదీస్తూ

కుటుంబానికి నీకూ మధ్య ఎల్లలులేని అనురాగం

అందనంత అనుబంధం

మేమంతా(దేశమంతా)నీ కుటుంమని

మదిని నింపుకొని హద్దులు సరిహద్దుల్లో కాపుకాసే

ధీరోధాత్తా

ఓ సైనికా నీకు సలాం...!!! 

వందనం అభివందనం

ఎప్పటికీ మాహృదయాన నీకే అగ్రస్థానం అందుకో నీరాజనం.


శ్రీ(ను)లత.కె (హృదయ స్పందన )

లెక్చరర్ 

జనగాం.



Rate this content
Log in

Similar telugu poem from Inspirational