సాయంసంధ్య వేళ
సాయంసంధ్య వేళ


సూరీడు వెళ్ళిపోతున్నాడు
గంట కొట్టగానే బ్యాగు తీసుకుని ఇంటికి పరిగెట్టే పిల్లాడిలా
మా స్కూలు పెంకుల మీద నుంచి
వరి పొలాల మీద నుండి
వాలుగా జారుతున్న నీటి మీద నుండి
వెళ్ళిపోతున్నాడు
కొంగలు కొన్ని ఎటో వెళ్లిపోతున్నాయి
నేనూ సావాసగాళ్ళతో కలిసి అరిచాను
కొంగా కొంగా పాలు బొయ్ అని
మేమ
ూ పరిగెత్తాం
సూరీడుకి పోటీగా
సూరీడు నల్లకొండను దాటాడు
ఇక కంచాలమ్మ చెరువు ఒక్కటే మిగిలింది
కాసేపటికి సూరీడు చెరువు నీళ్లలో దిగిపోతాడు
నేనప్పటికే ఇల్లు చేరి మిద్దె ఎక్కాను
గసపోసుకుంటూ నూగుల పిండి తిన్నాను
సూరీడికి కూడా ఇంటికి వెళ్ళడానికి తొందరే గదా
వాళ్ళ అమ్మ ఇచ్చే తాయిలం తినేసి ఆడుకోవడానికి