STORYMIRROR

Midhun babu

Abstract Classics Others

4  

Midhun babu

Abstract Classics Others

సాయే జీవం

సాయే జీవం

1 min
330


హృదిపాడేటి సాయిగీతమే

ఆశల పల్లకీకి బోగి అవుతుంటే,

తీపికలలే ఉషోదయపు వెలుగులై దరిచేరుతుంటే,

అనురాగమే అవనికోవెలగా కనిపించులే,

గుడిఘంటే సంకల్పానికి శుభము పలుకునులే.


మదిలోపలి వీధులలో

సాయే తిరగాడుతుంటే,

దివ్యమైన ప్రేమే ప్రతిపలుకుగా

వినపడుతుంటే,

సత్యమే అడుగులకు

పూలదారులయ్యెనులే,

పడదోసే చేతులే

జాగ్రత్తల వారధులుగా మారునులే.


మరువలేని అనుభూతులే

సాయికి ఊయలగా మారుతుంటే,

సాయి జపము తపమే 

మోహాల చీకట్లను తరిమేస్తుంటే,

సకలజీవాల్లో సాయిరూపమే దర్శనమిస్తుంటే,

అద్భుత సంతోషమే నేస్తమవ్వులే,

జన్మకర్మ మలిన్యాలే దూరమగునులే.

జయహో సాయి జయజయసాయి

మనసు దృష్టి నీపై చెరగనీయకోయి.



Rate this content
Log in

Similar telugu poem from Abstract