రహదారి
రహదారి
రహదారి
ఏది నా దారి?
నీతి కా.. అవినీతికా
మంచికా.. చెడుకా
ధర్మమా..అధర్మమా
న్యాయమా..అన్యాయమా!
ఎందెందు వెతకాలి నా దారి
ప్రేమలోనా..పగలోనా
స్నేహంలోనా..స్వార్థంలోనా
ఆనందంలోనా..ఆవేదనలోనా
ఆశయంలోనా..ఆకర్షణలోనా
అసలు నే యెందుకు వెతకాలి దారి
అధికారం కోసమా... మమకారం కోసమా
సంపద కోసమా.. సంతోషం కోసమా
బంధాల కోసమా..బాధ్యతల కోసమా
కుటుంబం కోసమా..నా కోసమా
ఏ దారో తెలియక
దారి తీరు లేక
ఇంతటి ఉత్కృష్ట జన్మను..
జనం మధ్యలో ఉంచాలా!
మనిషికి ఒకటే... దారి
అదే.. మానవత్వమనే రహదారి
ఆ దారిచ్చే
అత్యంత విలువైన బహుమతులే
జాలి..కరుణ..ప్రేమ..త్యాగం
......రాజ్....
