Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Venkata Rama Seshu Nandagiri

Inspirational

3  

Venkata Rama Seshu Nandagiri

Inspirational

రేపటి పౌరులు

రేపటి పౌరులు

1 min
181


మతసామరస్యమనెడి మొక్క క్షీణించు చున్నది,

పట్టించుకొను వారు లేక వాడిపోవు చున్నది.

పదవుల పందేరంలో నాయకులు విస్మరించారు,

భజనపరులు వారివెంట పరుగుపందెంలో ఉన్నారు.

పరువు-ప్రతిష్టలు, కులమతాల మత్తులో కొందరు ప్రజలున్నారు,

ఇంకొందరు పొట్టకూటికోసం తలమునకలౌతున్నారు.

పిల్లలు చదువుల్లో, రేంకులతో పరుగులలో మునిగి

పోయారు.

ఇంకెవరు మన దేశాన్ని భరతమాత బాధను పట్టించుకొనేవారు!

ఎవరికి కావాలి దేశాభివృద్ధి, సమైక్యత, సామరస్యత,

తమ స్వీయాభివృద్ధికే అందరూ ఇస్తారు ప్రాముఖ్యత.

అయినా, ఉన్నారు, దేశంకోసం ప్రాణాలిచ్చేవారు,

సొంతలాభం మానుకొని, పరులకోసం పాటుపడేవారు.

చూశారా, ఈ చిన్న బాలుడు, తన కష్టాన్ని సైతం లెక్కచేయక‌,

వాడుతున్న మొక్కకి నీరుపోసి బ్రతికించాలన్న బలమైన కోరిక.

అందుకే ఒంటికాలికి, విరిగిన గోలేన్ని ఆసరాగా చేసుకొని,

చేతిలో కర్రతో ముందుకు సాగుతున్నాడు మొక్కకు నీరందించాలని.

చిన్నవయసులోనే స్వంతం చేసుకున్నాడు గొప్పమనసును,

ఇలాంటి వారే కాపాడగలరు దేశ సమగ్రతను, సమైక్యతను.

ఇలాంటి వారే కావాలి, మన దేశ భవ్య భవితకు,

నేర్పాలి మనమే, మన పిల్లలకు, రేపటి పౌరులకు.


Rate this content
Log in