రైతే రాజు - కవితా గానం :
రైతే రాజు - కవితా గానం :


పల్లవి : మబ్బులానకే ఎదురుసుసే రైతన్నా
పొలం మన్నే బంగారమౌనన్నా
భూమిని సారవంతము చెయ్యన్నా
గింజల నిసిరి ఇసిరి చల్లన్నా \\ మబ్బులానకే \\
చరణం ౧ : పంట సిరులను పండించే వరమ న్నా
పొలంగట్టున గోదాం కట్టుకో న్నా
ప్రభుత్వ నీకు సాయం సేసేనన్నా \\ మబ్బులానకే \\
చరణం ౨ : దళారుల మాటలు నమ్మకన్నా
నీ పంటను నీవే గిట్టుబాటు ధరకమ్మన్నా
వచ్చిన సంపదలో ఏంటో కొంత ఋణం తీర్చన్నా \\ మబ్బులానకే \\
చరణం ౩ : మిగిలిన సంపద నీ కుటుంబానికి పెట్టన్నా
నష్టమొచ్చిందని నీ ఉసురు తీసుకోకన్నా
పంట మార్పిడి కొంతలో కొంత మేలన్నా \\ మబ్బులానకే \\
చరణం ౪: కొత్త సాంకేతిక పనిముట్లని వాడన్నా
హరితవిప్లవం అభివృద్ధి పరుచున్నా
దేశజనులకు భుక్తి దాతవు నీవన్నా
దేశానికి వెన్నెముక నీవే కదన్నా \\ మబ్బులానకే \\