రావోయి శ్రావణమా!
రావోయి శ్రావణమా!
నేను:
రావోయి శ్రావణమా
నన్నున్ నా స్వామిని కలుపవే
అడ్డబొట్టు పెట్టేవాడు
దిక్కులన్నీ బట్టలుగా చుట్టేవాడు
ఆశ్రిత మందారుడు భక్త సులభుడు
భోళా శంకరుని మది గెల్చుటకు మంచి యోచన సెప్పవే
ఇంక ఈ దాగుడు మూతలు ఆపవే
శ్రావణ మాసం:
వస్తున్నాను
ఆకాశగంగను మేఘాల నింపి
భక్త కోటి గుండెల్లో కొత్త వెలుగులు నింపుటకు
సామి మనసు నీవెరుగవా
నాకేదీ వద్దంటాడు అందరినీ నావాళ్ళంటాడు
నాకేదీ వద్దని శివభక్తి చాలని నమ్మి పిలిస్తే చాలు
నీ వెంటే ఉండి నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటాడు
