పుట్టినరోజు అని..
పుట్టినరోజు అని..
పండుగలా చేయాలని
పుడమి కోరుకుంది
ఆకాశపు రెప్పల మాటున
దాచిన విరహ బాధలను
కన్నీటి నీటి వర్షంలా పంపింది
పూల పుప్పొడినంతా
ఒక సంచీలో చేర్చి
పచ్చటి ఆకుల చెట్టు కొమ్మకు కట్టి
ఆ సువాసన స్వాగతం చెబుతుంటే
మెరుపులు తోరణాలుగా చేసి
ఇంధ్ర ధనుస్సును పిలిచి
రంగులు అరువడిగి
కొత్త రంగవల్లులు దిద్ది
కారణం లేని ప్రార్థనకు
ఫలితం వచ్చినట్లు
ఈ లోకం కొత్తగా పుడుతోంది
పుట్టినరోజు అని
ప్రతి రోజూ
ప్రకృతి పండుగ జరుపుతోంది
మార్పు కలిగిన ప్రతి క్షణం
కొత్త జన్మే కదా
మనసు పరిమళించే తత్వం
అందరం అలవర్చుకోరాదా
