STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

పుడమి తల్లికి శోభ

పుడమి తల్లికి శోభ

1 min
269

*పుడమి తల్లికి శోభ*


(పద్యమాలిక )


కలుషితంబైన దిచ్చోటి గాలినేడు

రోగముల్ పెచ్చు మీరగా లోకమందు

నీరసంబుగా నీ ప్రజ నీల్గుచుండి

బలము తరిగి పోవగతాము వడలు చుండ్రి.


మురికి నిండిన నదులతో ముప్పు వచ్చు

స్వచ్ఛమైనట్టి జలములు జగతియందు

కానరాకున్న వీవేళ కరువు నిండె

మంచి నీరము దొరకక మనుజులిపుడు

వలస పోవుచు నుండిరి భయము తోడ.


వనములన్ బెంచు చుండిన వసుధ యందు

భాగ్యరాశులు పొంగగా భావితరము

వర్థిలు చునుండునని నమ్మి ప్రజలు నేడు

పుడమి తల్లికి శోభగన్ మొక్కనాటి

ప్రకృతి వనరులన్ రక్షింప ప్రతినబూని

నిష్ఠగా నడిచిన చాలు నిలుచు మనికి.//



Rate this content
Log in

Similar telugu poem from Inspirational