STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Action Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Action Inspirational

పట్నంలో పల్లెగాడ్ని రోయ్..!

పట్నంలో పల్లెగాడ్ని రోయ్..!

1 min
580

పల్లెగాడ్ని రోయ్..! నే పల్లెగాడ్ని రోయ్..!!

పూట గడవక పట్నమొచ్చిన పల్లెగాడ్ని రోయ్...

మూట సర్ది వూరొదిలిన వలసగాడ్ని రోయ్...

కూటి కొరకు పాకులాడే పాలేగాడ్ని రోయ్...

నోటు కోసం లొంగిపోయే బానిసగాడ్ని రోయ్...

పల్లెగాడ్ని రోయ్..! నే పల్లెగాడ్ని రోయ్..!!

కోటి ఆశల్తో బస్తీ బాటట్టిన బాటసార్ని రోయ్...

ఎట్టుకున్న ఆశలడియాశలైనేళ దిక్కులేనోడ్ని రోయ్...

గేనమున్న గుత్తింపులేని ఇవేకుడ్ని రోయ్...

సత్తువున్న అవకాశాల్లేని బలవంతుడ్ని రోయ్...

పల్లెగాడ్ని రోయ్..! నే పల్లెగాడ్ని రోయ్..!!

పల్లెటూరి గడప గడపకి తిరిగిన అడుగుల్నావి రోయ్...

నగరపు ఈధి ఈధిన అరిగిన చెప్పుల్నావి రోయ్...

ఊరినోట ఎరిగిన ఒంశాల్నావి రోయ్...

పురిబాట ఎరగని పేరుల్నావి రోయ్...

పల్లెగాడ్ని రోయ్..! నే పల్లెగాడ్ని రోయ్..!!

పల్లె గాలికి ఊపిరోసుకున్న అణువుల్నావి రోయ్...

పట్నపు కల్మషానికి ఆవిరౌతున్న అసువుల్నావి రోయ్...

ఆడ, మందికి ఒక్కడిగా మెలిగిన తత్వం నాది రోయ్...

ఈడ, గుంపులో ఒంటిగా మిగిలిన దేహం ఇది రోయ్...

పల్లెగాడ్ని రోయ్..! నే పల్లెగాడ్ని రోయ్..!!

తిన్నావా, పండావా అని పలకరించే ఇరుగుపొరుగోల్లు లేరాయేరోయ్...

అసలున్నావా, పోయావా అని అడిగే చుట్టాల్ పట్టాల్ కరువాయేరోయ్...

నెత్తినెక్కి ఆడించే దొరలకేం తెలుస్తుంది రోయ్...

గద్దెనెక్కి పాలించే ప్రభువులకేం పడుతుంది రోయ్...

ఈ పల్లె గాడి ఆవేదన!, దాని ఎనకున్న యేదన..!!

పల్లెగాడ్ని రోయ్..! నే పల్లెగాడ్ని రోయ్..!!

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract