పరుగు పదం
పరుగు పదం
పరుగు పదం
మరోరోజు ప్రయాణంలో మెట్రో అసహనంగా ఉంది
ఆడపిల్లని కాపాడలేని నగరాన్ని శపిస్తూ
మనుషులు సుందరంగా ఉంటారు
మనసులు మాత్రం వెకిలిగా మకిలితో చిన్నబోతూ
మబ్బులన్నీ తెల్లబోయాయి
కన్నీటి జల్లొకటి అడపాదడపా కురుస్తోంది
పలకరించే సూరీడు ఘోరకలిని నిరసిస్తూ
తూర్పు ఘోషను పశ్చిమాన నినదిస్తున్నాడు
సందడి చేసే పక్షులూ పలకరించను మానేశాయి
కువకువలన్నీ కునారిల్లుతున్నాయి
హేమంతాన్ని చీకట్లు ఆవరించాయి
చితిలోకాలిన మానవత్వం బూడిదై భోరుమంటోంది
హృదయాలన్నీ పాషాణావులవుతుంటే
ఇక ఉదయాలన్నీ ఎదురుచూపుల గుమ్మాలే
ఆకాశంలో సగాన్ని చిదిమేస్తున్న పురుషప్రపంచానికి
దారిచూపే అమ్మలు కావాలి.. ఉగ్గుపాలే కాదు
ఉగ్రనేత్రాలూ చూపాలి..పరుగాపని మెట్రో తీగలచింతవుతోంది