STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ప్రణయ గంగ

ప్రణయ గంగ

1 min
331

తపము సేయగ

తనువులోని ప్రణయ గంగ ఉప్పొంగ

ఆమె నడిచినది కెరటముల వెంట


భావావేశములు తాళము రాగములై

విరించి వ్రాసిన కొత్త రాతలా ఉంది

అతడి గానం వినేందుకు 

ఆమె విడిచినది భయమును


అతడి గానం వేగమైనది

ఆమె నడక పరుగులా

ఆ పరుగు నాట్యములా మారింది


యుగాంతమున ఎగసిపడునట్లు

అతని సంగీతం ఆమెను చుట్టుముట్టింది

ఆ ఇసుక నిండా ఆమె నాట్య భంగిమలు

ఆకాశమే ప్రేక్షకుడు


అతడి రాగానికి శృతి ఆమె స్మృతి

ఆమె నాట్యానికి గతి అతడి ఖ్యాతి

పర్వతములు దాటి గంగ సాగరము చేరినట్లు

సమస్యల చిక్కుముడులు విప్పుతూ

ఆమె అతడిని చేరింది

పాట ఆటతో జత కట్టింది

అనంత సాగర సంగమములో

ఒక కొత్త లయ వినిపిస్తోంది

బహుశా అది ప్రేమ కావచ్చు

విధిని ఎదిరించిన వింత అనొచ్చు



Rate this content
Log in

Similar telugu poem from Abstract