పరిసరాలను కాపాడటం
పరిసరాలను కాపాడటం


మనకు బహుమానంగా వచ్చింది భూలోకంలో జీవితం,
వసుంధర పైన ప్రాణుల జీవితం అనిపించెను అతి అద్భుతం |౧|
మన పూర్వజులు మనకు ఇచ్చారు అందమైన పరిసరాలు,
కాపాడి కాపాడి భూసంపదలతో తీర్చారు మనందరి అవసరాలు |౨|
వనముల విధ్వంసంతో పెరిగిపోతోంది కాలుష్యం,
పరిసరాలను కాపాడటం అన్నది ఇప్పుడు ముఖ్యమైన భాష్యం |3|
నిత్యం కాలుష్యం పెంచుతోంది పారిశ్రామికీకరణ,
అత్యవసర ఉపాయలతో చెయ్యాలి ప్రాకృతిక పరిరక్షణ |౪|
అరణ్యాలు భూగర్భజలాలు నదులను కాపాడటం ఎంతో అనివార్యం,
వచ్చే తరానికి కొత్త జీవితం ఇవ్వటానికి తప్పక చెయ్యాలి ఈ మహత్కార్యం |౫|
పరిశుభ్రత పై పెంచాలి జనాలలో అవగాహన,
అప్పుడే చేయగలుగుతాం నూతన ధరిత్రి రూపకల్పన |౬|