పరిచయం
పరిచయం
ఏదో కదులుతోంది
వీపును చుడుతూ
నన్ను పక్కకు నెడుతూ
రోమాల మీద వేడి గాలి
చికాకు తెప్పిస్తూ వెళ్ళింది
పెరిగిన గోరులో చేరిన మట్టి
తినేటప్పుడు ఒంట్లోకి చేరినట్టు
నేను గమనించకుండా
ఏదో నా పక్కనే చేరింది
రాత్రుళ్లు కొట్లాడింది
నిద్దర చెడగొట్టింది
కళ్ళు మూతలు పడే సమయానికి
వీపును పొడుస్తూ ఉంటుంది
నల్లేమో అని పక్క విదిలించాను
ఒళ్లంతా శుభ్రం చేసాను
పరిమళం ఇచ్చే సెంటు చల్లాను
ఇప్పుడు అర్థం అవుతోంది
అది నీ కౌగిలి ఆనవాలు
కొత్త పరిచయంలా మారింది
అప్పుడు హత్తుకున్నందుకు
ఇప్పుడు వదలట్లేదు
ఎలాగైనా వదిలించుకోవాలి
ఎలా
ఎలా
నిద్రపడితే చాలు
అంతా మర్చిపోవచ్చు
