STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

"ప్రేమంటే..!"

"ప్రేమంటే..!"

1 min
374

ప్రేమంటే..?


తొలివలపులోనే అందాలకి ఆకర్షితమవడమా...?


ప్రేమంటే..?


ప్రపంచంతో సంబంధం లేకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏకదాటిగా చూసుకోవడమా..?


ప్రేమంటే..?


సమయమే తెలియకుండా నిరంతరం మాట్లాడుకోవడమా..?

ప్రేమంటే..?


కరచాలనం చేయడమా...?


లేక, శారీరకంగా కలవడమా..?


హృదయపు లోగిళ్ళు చేసే తియ్యటి సంభాషణ ప్రేమంటే,


మది తలుపులు తెరిచి వినగలిగే నిశబ్ద శబ్ధం ప్రేమంటే,


రాయడానికి సాధ్యపడని ఓ కమ్మటి కావ్యం ప్రేమంటే,


వ్యక్తపరచడానికి వీలుకాని ఓ తియ్యటి వాక్యం ప్రేమంటే,


ఊహకి అందని ఓ మధుర స్వప్నం ప్రేమంటే,


వర్ణనకి దొరకని ఓ సుమధుర భావం ప్రేమంటే,


కొందరికి మద్దతుగా ఉంటూ చేరువయ్యే ఈ ప్రేమ,


మరికొందరిని ఇబ్బంది పెడుతూ దూరమవ్వొచ్చు..!


ప్రేమించిన వ్యక్తి దూరమయ్యారనో ?


లేక, వేరొకరితో వెళ్లిపోయారనో ?


ఆ ప్రేమ చూపించడం ఆపగలం కానీ,


అసలు ప్రేమించడమే ఆపమంటే ఎలా ?


అదసలు ప్రేమెలా అవుతుంది...?


ఒట్టి వ్యామోహం...!


ప్రేమించి మోసపోయిన వారు అమాయకులు కాదండోయ్..!


ఆ ప్రేమను అర్థం చేసుకోలేక మోసగించిన వారు నిజమైన అమాయకులు..!!


ఎందుకంటే ఆ ప్రేమను పొందే అర్హత వారికి లేదు కాబట్టి..!!!


ప్రేమనేది గుడ్డిది కాదండోయ్..!


స్వచ్ఛమైన ప్రేమలో కూడా తుచ్ఛమైన సాకులు వెతికి


ఆ ప్రేమించే అర్హత కోల్పోయే వారు వాస్తవానికి మానసిక వికలాంగులు.


సిద్ధాంతాలతో ఏర్పడిన ప్రేమ,


రాధ్దాంతాలతో నలిగిపోతుంది.

అదే ప్రేమకున్న శక్తి, అది అర్థం కాకపోతే దానిపై విరక్తి.


అయినా ...


ప్రేమనేది మధురం..!


ప్రేమనేది అమరం..!!


దానికి చావు లేదంటూనే చంపేయమంటుంది ఈ లోకం..!


ఈ సృష్టిలో ప్రతి జీవి ఇంకో జీవిని ప్రేమించగలిగె హక్కుంది.


కానీ, ఓ జీవికి ఇష్టం లేకుండా తన ప్రేమను పొందగలిగె హక్కు ఏ జీవికి మాత్రం లేదు.


అందుకే అలాంటి ప్రేమని...


వ్యక్తపరచడానికి అర్హత కావాలి,


పొందడానికి అదృష్టం ఉండాలి.


Love is the only one,


There is neither pure love nor true love.


But


The love can make you pure,


The love can make you true.


Happy Valentine's Day


to all those


who struggled in love,


who suffered in love


but still sacrifice their love to keep their partner happy...


- mr.satya's_writings ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract