ప్రేమకెంత పోరాటమొ
ప్రేమకెంత పోరాటమొ
మాటకెంత మోమాటమొ..తన మౌనం వీడేందుకు..!
మనసుకెంత ఆరాటమొ..తన గీతం పలికేందుకు..!
ఒణుకు పెదవి సందడేగ..మోహపు తెరచాప నుండి..
తలపుకెంత ఉత్సాహమొ..తన నాట్యం చేసేందుకు..!
చెలిమివీణ తంత్రులలో..రాగసుధా నిధులెన్నో..
వలపుకెంత ఉబలాటమొ..తన మోదం కురిసేందుకు..!
గాలికన్న లాలించే..అమ్మ ఒడే లేదు కదా..
ప్రేమకెంత పోరాటమొ..తన హృదయం పంచేందుకు..!
తెగిన కంటిచుక్క కన్న..భారమైన దేముండును..
మట్టికెంత అనురాగమొ..తన దీపం కాచేందుకు..!

