STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

4  

Dinakar Reddy

Abstract Romance

ప్రేమ పల్లవి

ప్రేమ పల్లవి

1 min
383

ఊసులెన్నో చెప్పాలి

నా మనసు నీ ముందు విప్పాలి

నీ భాషకు తెలీని విషయాలు

నా స్పర్శతో నీకు నేర్పాలి


బాసలెన్నో చెయ్యాలి

నీ సొగసును కాచుకోవాలి

నా పెదాలకు తెలీని సరదాలు

నీ నవ్వుతో నాకు నేర్పాలి


శాశ్వతం కాదని తెలిసినా ఆశపడాలి

అదేగా జీవితం

అందరూ అంతేగా

తనువూ మనసూ నిన్నే కోరాలి

తప్పేముంది

నువ్వూ నన్నేగా కోరేది

ఈ కాసేపైనా నిజంగా అనుకునేది


అంతగా విడిపోవాల్సి వస్తే

ఎడారి గతం సముద్రమయినట్లు

నా గతం నువ్వు కావాలి

స్వగతంలో చిరంజీవివి కావాలి


నా వలపు వెన్నెల కిరణాలు

నీ ఆశల రేకుల్ని తాకాలి

నా బ్రతుకు బాట చరణాలకు

నువ్వు ప్రేమ పల్లవి కావాలి


Rate this content
Log in

Similar telugu poem from Abstract