పొలం గట్టు షేర్షా
పొలం గట్టు షేర్షా
పొలం గట్టు...షేర్ షా!!!
శ్రమైక జీవనంలో
చెమట సూరీడి
పొద్దు పొడుపూ...
పొద్దు కుంకూ...
పొలములోనే.....
మండుటెండలో
నిండు చందమామలా
వెన్నెల 'ఎద' జల్లుతూ...
విధులు నిర్వర్తించి
వ్యవ'సాయం' చేయగలడు
కాయకష్టం విద్యను
అభ్యసించిన
ఆకుపచ్చ మనిషి
సస్యశ్యామల ప్రపంచాన్ని
సృష్టించి...పంచుతాడు
వేకువునే నిదురలేచి భుజాన
సూరీడును మోసుకొచ్చి
మట్టిలో పరిగెత్తు ఆటలాడించి
మట్టిని నవ్వించి
తాను నవ్వుల పాలౌతున్నా
మనకు బువ్వలు తినిపించే
పైరుపైట అమ్
మ రైతు
ఏటిగట్టు మీద దారినికన్నా
గోదాటి నీటి హెచ్చుతగ్గుల చూస్తూ
తాను దప్పికతో వున్నా
పంట గొంతులో కావలిసిన
నీటిని పోసి బ్రేవ్ మని తేన్చి
మొక్క తలనిమిరి
దిక్కులకు మొక్కులుమొక్కి
మట్టివాసనతో
కడుపు నింపుకుంటున్న
పసర వాసనల
అమ్మమ్మ రైతు
గుక్కెడు గంజినీరు త్రాగి
పొలం గట్టుపైనే
కునుకు తీసి కులాసాగా
కుర్రవాడై మళ్లీ
మరయంత్రమై
ప్రకృతికి ప్రాణవాయువౌతాడు
మనకి తిండికి లోటులేకుండా
చూసుకొనే నాన్న అవుతాడు రైతు.