STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Classics Inspirational

5.0  

Thorlapati Raju(రాజ్)

Tragedy Classics Inspirational

పల్లెటూరి పయనం!

పల్లెటూరి పయనం!

1 min
364


ఎటు పోతుంది ప్రయాణం?

పల్లెటూరి పయనం!


ప్రశాంత పవన వీచికలైన పల్లెలు

యంత్ర భూతాలతో..

అశాంతి పవన సూచికలయ్యాయి!


పచ్చదనాన్ని కవచంగా ధరించిన పల్లెలు

చెరువుల కబ్జాలతో ఎరుపెక్కి పోయాయి!


పచ్చని చెట్లతో ప్రాణ వాయువునిచ్చే పల్లెలు

హాని వాయువును ఇచ్చే మారణాయుధాలు

అవుతున్నాయి!


పక్షుల కిలకిలారావాలతో 

ఆహ్లాదమైన సంగీతాన్నిచ్చే పల్లెలు

పాప్ అరుపులు లాంటి 

పరిశ్రమల శబ్దాలతో హోరేత్తుతున్నాయి!


అమ్మా!అంటే అన్నం పెట్టే పల్లెలు

గుప్పెడు మెతుకులు కోసం..

గూడెం ను వదిలి పొమ్మంటున్నాయి!


పొరుగు వాని కష్టానికి పరుగెత్తుకొచ్చే పల్లెలు

కష్టానికి తాళలేక పట్నానికి..

తారు మార్గాలవుతున్నాయి!


అమ్మ నాన్న.. అత్త మామ అంటూ

పాలలో పంచదారలా ఉండే పలకరింపులు

మమ్మీ డాడీ అంకుల్ ఆంటీ అంటూ..

నీటిపై నూనె లా తేలిపోతున్నాయి!


ఎటు పోతుంది పయనం?


పారిశ్రామిక రంగపు పాతాళంలోకా!

సాంకేతిక రంగపు సొరంగం లోకా!

అంతు తెలియని... 

అంతర్జాలపు అంచుల లోకా!


మనకు కావల్సింది

ప్రపంచీకరణ కాదు!


ప్రావీణ్య అనుకరణ

నైపుణ్య ఆవిష్కరణ

అదే....ఆధునికీకరణ!


   .......రాజ్......



Rate this content
Log in

Similar telugu poem from Tragedy