పిల్లల ప్రేమ !
పిల్లల ప్రేమ !
పిల్లలేనండోయ్ ... పిల్లలు
మేఘాల గర్జనతో పుట్టే పిడుగులు
రేపటి ప్రపంచానికి పరిపూర్ణతను తెచ్చే వ్యక్తులు
అందం , ఆనందం విలసిల్లేందుకు శక్తులు
నేడు మీరెలాగో ... రేపు వారు
తరతరాలకు మానవత్వం శోభిల్లేందుకు కారకులు
తోటలో పూచే పూలతో పరిసరాలకు జిలుగులు
గాలిలో తేలే మబ్బులతో ఆకాశానికి మెరుగులు
ఆ ఆశతోనే అందరు సృష్టిలో తల్లిదండ్రులవుతారు
పిల్లలు పెరిగి పెద్దవుతోంటే చూసి సంతోషిస్తారు
నేటి యువకుల్లారా ...
పుడమికి పచ్చదనాన్నిచ్చే వృక్షాల్లా పెరిగిన మనుషుల్లారా
స్వచ్ఛమైన గాలిని అవి పంచేలా ...
నీడనిచ్చి వేడిని హరించేలా ...
వృద్ధాప్యంలోని తల్లిదండ్రులకు అండగా నిలిచి
వారి మానమర్యాదలు కాపాడండోయ్
పిల్లలప్రేమను చూపి నమ్మకాన్ని పెంచండోయ్
మీ ప్రేమకు సాక్ష్యాలు మిమ్ము మెప్పించేరోజు
రాలే ఆనందభాష్పాలు మీ కృషిని అభినందిస్తోంటే
చూసి పులకించి తరించండోయ్ !
శుభతరుణం మళ్ళీమళ్ళీ తుళ్ళేలా మెలగండోయ్ !!
*** # *** # ***
