STORYMIRROR

Dinakar Reddy

Drama Thriller

4  

Dinakar Reddy

Drama Thriller

పెద్ద దిక్కు అని

పెద్ద దిక్కు అని

1 min
249

అతడి మాటలు శాసనంగా

శాశ్వతంగా నిలుస్తాయనుకున్నాడు

గౌరవంగా చూసే వాళ్ళను

భయపెట్టే బ్రతకాలనుకున్నాడు

అలానే బ్రతికాడు కూడా


కాలం కదిలింది

అతని శక్తిని కరిగించింది

అవసాన దశలో

నోరు మాత్రమే శక్తిని కూడగట్టుకుని నిలిచింది


ఖల్ ఖల్ అంటూ దగ్గు

చిరపరిచితమైన పాత నొప్పులు

పిలిచినా పలికేందుకు

ఇష్టంగా దగ్గరికి వచ్చేందుకు

ఎవరికీ మనసు రాలేదు

బంధాన్ని బాధ గెలవలేదు అనుకున్నాడు

అతడి పాత ప్రవర్తన

మరచిపోవాలని అనుకున్నాడు


నిందించాడు

మరలా మరలా

శాసించాడు

పెద్ద దిక్కు

ఏ దిక్కుకు చేరెనో మరి..


Rate this content
Log in

Similar telugu poem from Drama