గత జ్ఞాపకాలు
గత జ్ఞాపకాలు


ఎక్కడో ఎదమూలలో ఏదో సవ్వడి
ఎన్నడో విన్నట్లున్న అదే ఆ అలికిడి
గుండెల్ని గురితో కొట్టేసే హడావుడి
జ్ఞాపకాలే ఆ మదిలో ఒకటే కలివిడి
కలిసొచ్చిన కాలంలో కలసి నడిచిన గుర్తులు
వెలుగులిచ్చిన వలపు ఉషోదయా గమ్మర్తులు
గుర్తుకొస్తున్నాయి మాసి పోయిన ఆ చారికలు
మనసుని మత్తులో ఉంచీ ఆడిన పరిచారికలు
వలపు వానలో తడిసి తడిమంటలే తనువంత
తలపులే మానసమంతా వదలక ఏ అణువంత
జగమంతా జాజి పూల సుగంధమై వర్ణమయం
ఇద్దరిమధ్య ఒక్కటై ఘనీభవించిన ఆ సమయం
ఏది ఆ సమయం ఏ ఎడారిలో లభ్యం
ఒయాసిసులో దొరికేనా ఆ సౌలభ్యం
ఎండమావులకే నిలువ ఎండిన గుండె
గత జ్ఞాపకాలు మదిలోమండిన గుండ
మన్నించుమా నేస్తమా మళ్ళీరగల్చకు
మిత్ర ద్రోహము ఉనికి ఇంకా మిగల్చకు