ఓ మనసుంది !
ఓ మనసుంది !
నా ఎదురుగా ఉన్నది ఎవరైనా ,
మనసు ఆమెకే నెలవు .
ఎంతమంచో తెలుపుటకు మాటలు చాలకున్నా ,
ఆ మనిషి ప్రేమకు ఉండదేనాడూ సెలవు .
వాని అసలు సంగతేమిటో
ప్రేమికుడిగా అందరికన్నా నాకే బాగా తెలుసు .
ఎందుకంటే ,
ఆమెతీరు అన్నంలో తినే తోటకూర పులుసు ,
బహుదూరమే ఒకరికొకరన్నా అలుసు .
ఆమె పరిచయము ఒక స్నేహదీపము ,
నాలో వెలిగించును మమతలధూపము .
చూపులకు ముద్దులొలికే రూపము ,
తగ్గిపోవు నిమిషాల్లో ఎంతైనా తాపము .
ఆమెనవ్వు ఒక విరిసిన పువ్వు .
కొండలనడుమ జారే జలపాతమూ అవ్వు .
పెదవుల దాగిన మందారప్పువ్వు
నాలో తియతియ్యని కోర్కెలు రువ్వు .
ఎర్రని ఆ లోగిళ్ళు దానిమ్మలకే అసూయలు ,
మాధుర్యాలు చెరకుపంటలకే మెళుకువలు .
మాలో ఆనందం రోజూ నదిలోని వెల్లువలు ,
ప్రేమ కలకాలం పచ్చనై ఇంట్లో కువకువలు .
