ఒంటరి జీవినినేను
ఒంటరి జీవినినేను
నేనెవరినంటే....!
లక్షలు కట్నంగా పోసి నిర్బంధంలో
నివసించే విడుదల లేని ఖైదీని నేను
రెక్కలొచ్చినా విహరించలేని పంజరంలో
బందీ అయిన స్వేచ్ఛ లేని పక్షిని నేను
అంతరంగంలో తన్నుకు
వస్తున్న దుఃఖానోర్చుకుని
పెదవులపై కపట నవ్వు చిందించే
చిరునవ్వును నేను...
నెత్తుటి శ్రమ పెట్టుబడితో
కంచంలో కూడయ్యే మాంసపు ముద్దని నేను....
ఒంటిపై మాయని గాయాన్ని
ఎదలోని తరగని భాధని కప్పిపుచ్చి
ఉలుకు పలుకులేని ప్రాణమున్న శిలని నేను....
ఆశల సుడిగుండంలో భావ ప్రవాహంలో
కొట్టుమిట్టాడే ఈతరాని చేప పిల్లని నేను....
ఈ సృష్టిని సృష్టించే సృష్టికర్తయై
ఈ మానవ మనుగడ కు ఆధారమయ్యే మూలాన్ని నేను...
కానీ ఈ సమాజం
దృష్టిలో చెప్పినట్టు ఆడే నేనో కీలుబొమ్మను...
ఆజ్ఞాపించిన అవసరాలను తీర్చే నేనో తోలుబొమ్మను...
శ్లోకాలలో సామెతలో కీర్తించబడుతూనే
శోక సంద్రంలో బతికే ఓ అనామిక నేను...!
ఒంటరి జీవిని నేను....!
