బాలల గేయం :కవీశ్వర్ : 20 . 09 . 2022
బాలల గేయం :కవీశ్వర్ : 20 . 09 . 2022
బాలల గేయం : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా .
కవీశ్వర్ : 20 . 09 . 2022
గురువు: పిల్లల్లారా! మీరేవిధంగా గురువులను గౌరవిస్తారు?
గేయం :
బాలలు: బాలలమండీ !మేము వృద్ధి నొందే బాలలమండీ !
నిష్కల్మష హృదయులమండీ !మీ కీర్తికి కలికి తురాయులమండీ !
ఇంటినుండి బయలుదేరి మీ మార్గదర్శనం కొరకు వచ్చామండీ !
మా మదిలో దేవతలుగా ఊహించి మీ గురించి తెలిసి వచ్చామండీ !
మా మంచికే కృషిచేసే మీకు అపఖ్యాతిని రానీయమండీ
సదా మీకండగా ఉంటామండీ !
మీసూచనలే పాటిస్తూ,మీకృత్యాధారా కల్పనలే చేస్తూ
మా నైపుపుణ్యాన్నిపెంచుకుంటామండీ !
మాలో మేము కలహించుకోకుండా , వాద ప్రతివాదములకు
దూరంగా ఉండి వచ్చే తరాలకు ఆదర్శంగా ఉంటామండీ !
మీ నష్టాలకు,కష్టాలకుమేము కారణం కాకుండా వ్యవహరిస్తామండీ !
భవిష్యత్తులో మీ కృషిని గుర్తించి , బహుళ ప్రజాదరణ చేస్తామండీ !
వ్యాఖ్య : "ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇది మా బాలల తరపు ఈ మా భరోసా"
