సందె వేళ
సందె వేళ
చందమామ చూడమాకే దొంగచూపులు మబ్బుతెరలు
దీసిమరీ చూడ దగుననా ఇన్నిసొంపులెందుకనీ
ఏమిప్రశ్నలోయ్ కొంటిమామ ఇంటికొచ్చే వేళ కదోయి !!
మల్లెపూలు పూసింది నీకోసం కాదులే సేలాయేటి పరవళ్ళు
నిన్నుచూసికాదులే చిలిపినవ్వునవ్వుతూ నువ్వుపరిచినీవెన్నెల
పరవశించు మనసుకు పందిరాయెనీవేళ మనసుపాడు
పాటకు వేణువాయెనే ఇలా దొంగచూపు చూడకోయి చందమామా
అందగాడి వేళకి, నన్నుండనీ ఇలా......

