అంతమెపుడు
అంతమెపుడు
పెరుగుతున్న కాలుష్యపు..భూతాలకు అంతమెపుడు..!?
కాల్చివేయు ఈ వేసవి..తాపాలకు అంతమెపుడు..!?
మిత్రులతో వైరాలను..మానాలని తెలయరేమి..
శత్రుత్వపు మిసైళ్ళ ప్రయోగాలకు..అంతమెపుడు..!?
పూలు తెంపి పరిమళాలు..నేలరాయు సంస్కృతేల..
జరుగుతున్న జీవహింస..హోమాలకు అంతమెపుడు..!?
లేతగాలి ఊయలలా..మది నిలుపుట చెలిమి కదా..
సంసారపు వడగాడ్పుల..కలహాలకు అంతమెపుడు..!?
హద్దుపద్దు లన్ని దాటి..దురాక్రమణ బుద్ధులేల..
దాయాదుల సరిహద్దుల..యుద్ధాలకు అంతమెపుడు..!?
