చివరి మజిలీ
చివరి మజిలీ
ఎంచుకున్న ప్రతి గమ్యం ఉండదు అరచేతి రేఖల్లో
తలరాత అనుకుంటే అసలే కనిపించదు
గమ్యాన్ని విల్లులా ఎక్కు పెట్టాల్సింది
టార్గెట్ కు తగిలేలా తూటా పేల్చాల్సింది
ఏదైనా మనమే చివరి మజిలీ వరకు
గమ్యం మిగిలిపోతే ఏం చేయలేం చివరి మజిలీలో
వారసుల లక్ష్యాలు ఉంటాయి వేరుగా
మనసెరిగి చేస్తారనుకోవడం కల
చివరి మజిలీ ముందు చేయాలనుకున్నా
మనసు జేబుల్లో వైరాగ్యం కుక్కబడి
శ్వాసాడితే చాలనుకుంటామేమో
చుట్టూ ఉన్న ప్రపంచంపై నమ్మకం సన్నగిల్లితే
తారుమారవుతాయి ఆలోచనలు, ఆశయాలు
చివరి శ్వాస లోపల గమ్యంపై జెండా ఎగరేయడం
సాధ్యం కాదు అందరికీ
గమ్యం చేరాలన్న తపన తీవ్రమైతే
ఆరిపోయే వరకు వెలుగునిచ్చే దీపంలా బతుకు
వెలిగిన కాలంలోనే వేలాది దీపాలు వెలిగించడం
అప్పుడు తృప్తిగా చివరి మజిలీ
చివరి మజిలీలో ఎవరొస్తారో రారో
కట్టుకునే బట్టలు తోడుండవు
వేలి ఉంగరాలు, మెడలో నగలు తీసేస్తారు
మృత శరీరాన్ని తరలిస్తారు స్మశానానికి
చచ్చినా బతికుండాలంటే నేత్రదానం,అవయవదానం
వైద్య కళాశాలలకు శరీర దానం
అప్పుడు మరి కొన్నాళ్లు బతికున్నట్ల

