STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Tragedy Action Inspirational

5.0  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Tragedy Action Inspirational

నేను!

నేను!

1 min
433

నేను,

పని చేసే యంత్రాన్ని నేను ....

అవసరాలు తీర్చే వస్తువును నేను ..

ఎంత మంది ఉన్న...

నాకు మనసు ఉందని..

నాకు ఫీలింగ్స్ ఉంటాయని

ఎవరు గుర్తించలేని ఒంటరిని నేను ..

బంధాల పంజరంలో బందించబడ్డ

బంగారు చిలుకను నేను..

స్వేచ్ఛను కోరుకునే పావురాన్ని నేను..

మనసులో భారాన్ని మోస్తు సహనంగా

పడివున్న పుడమిని నేను ..

కన్నీళ్ల కాలువలో కొట్టుకుపోతున్న

కాగితపు పడవను నేను ..

రంగుల లోకాన్ని చూడాలని ఎగిరి

రెక్కలు విరిగిన పడిన విహంగాన్ని నేను..

కాసింత ప్రేమకు కరిగిపోయే కొవ్వత్తి ని నేను

స్వచ్ఛమైన ప్రేమకు బానిసను నేను..

ప్రేమ బాహువుల్లో బందీని నేను..


నేను ఎవరో తెలుసా నేనే స్త్రీ ని..

ఇదే నా హృదయ స్పందన..


శ్రీ...

హృదయ స్పందన 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy