మట్టి మనిషీ
మట్టి మనిషీ
నీలిమేఘం కురిసే రోజు రైతు నువ్వు పూసే రోజు
చెమట చినుకులు జలధిలాగా కళ్ళు తడిచే రోజు
జీవితమంతా నేల గాథే వినిపించని రాగం...
చిన్న విత్తనంలో పెద్ద కల నిద్రలు లేని రాత్రులు
పాదాల్లో మట్టి గంధం హృదయంలో తెలియని మౌనం
రేయి రేయి ఆశలే సాగరం పొలాల్లో మౌనమే సంగీతం
నెమలి నాట్యంలా నిత్యం పంటలతో నృత్యం...
అన్నం పుట్టే వేళ గాథ ఎన్నో ఏళ్ళ కన్నీటి గాథ
జీవితమంతా కష్టాల మూట కనిపించని కన్నీటి వాన
రుణాల ఊబిలో ఆశల నౌక అయినా వదలదు సాగు బాట...
పసిపాపలా సాకే పంట.. పసివాడిలా ఏడ్చే గుండె
లోకానికి పెట్టే ముద్ద వెనుక.. దాగుంది ఎంతో వ్యధ
నేల తల్లి ఒడిలోన.. రాలిపోయే శ్వాసలా
రైతు జీవితం ఒక త్యాగం.. ముగిసిపోని ఒక శోకం
నీలిమేఘం కురిసే రోజు.. రైతు నువ్వు పూసే రోజు..!!!
