STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఇష్టం

ఇష్టం

1 min
5



నా లోపలి నిను చూస్తూ..ఎదగటమే ఇష్టం..!
అందరిలో ఉన్న నిన్ను..చూడటమే ఇష్టం..!

కలలు కనే ముచ్చటలో..జన్మలెన్నో ముగిసె.. 
మరి ఈపై నీ వెంటే..నడవటమే ఇష్టం..!

మాటలాడు మనసునెలా..ఆపాలో చెబితివి..
ప్రతి మాటా నీ పాటన..పొంగటమే ఇష్టం..!

దూకే ప్రతి సెలయేటా..నీ నవ్వే వింటూ..
వెలుగుతేనె రాగాలను..పంచటమే ఇష్టం..!

ప్రతికంటా దాగివున్న..సంద్రాలవి ఎన్నో..
ఇగిరించే వాక్యాలుగ..మిగలటమే ఇష్టం..!

అన్నింటికి సాక్షియైన..నీ స్నేహమె స్నేహం..
నీ చూపుల మధుశాలన..ఆగటమే ఇష్టం..


Rate this content
Log in

Similar telugu poem from Classics