STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

అక్షరాల వెలుగు

అక్షరాల వెలుగు

1 min
1

అక్షరాల వెలుగును నేను అందుకోలేకపోయాను..
చదువు విలువ తెలియకనే కాలం జార్చుకున్నాను..
సందడంత ఎదుటివారిదే.. నాకెందుకో ఈ చీకటి..
వెలిగిపోయే లోకంలో.. మిగిలిపోయా ఒంటరిగా..!


సంచీ భుజాన వేసుకుని సాటిపిల్లలు వెళ్తుంటే..
మదిలో ఏదో వెలితి నన్ను నిలువునా దహించేస్తుంటే..
పుస్తకాలు తెరిచే భాగ్యం నేడు నాకు లేదాయే..
తప్పు తెలుసుకునేసరికి.. కాలం చేజారిపోయే..!

బడిగంటల ఆ పిలుపులు.. నాకెందుకో వినపడలేదు..
గురువుల ఆ దీవెనలు.. నా నుదుటన రాసిలేదు..
కష్టపడి చదివుంటే.. గౌరవంగా బతికేవాణ్ణి..
కన్నీళ్లే నా కలమై.. నా కథనే రాస్తున్నా..!

చదువులేని నా జీవితం.. దిక్కులేని పడవాయే..
ఆశలన్నీ ఆవిరై.. గుండె నిండా బాధాయే..!


Rate this content
Log in

Similar telugu poem from Classics