అపరంజి
అపరంజి
అందాల ఖజానా అపరంజి పూబంతి
ప్రధమమే లోహాల క్రమములో హేమమే
చూచిన వెన్నెల రూపమే కన్నుల పండుగ చేసినది
అప్సర లక్షణ నిక్షిప్త దృష్టిని మరల్చ కష్టమట
నవనవ లాడే యవ్వనం తళతళ లాడే సోయగం
తాలుట దుర్లభ మేనంట కోరిన శక్యము కాదంట
కొలనున కదలగ నీకరము కలిగెను నామది చేతనము
శిఖలో నింపిన మల్లియలు నాహృది రేపెను కోరికలు
ఆశలు మోసుల నెత్తినవి కూర్మిని దయతో వొప్పుకొను
చిత్తము చలించి వేడెదను నాదరి చేరగ కోమలివె
అపురూప మనదగు సౌందర్య రాశీ నీదనువాదమున
అనన్యము లలనా లావణ్య శోభలు నీవనురాగమున
అవకాశ మిచ్చిన ఆనంద మొందీ నావిగచేసుకొని
నాహృదయ పీఠం నిన్నుంచి నిరతముగొలుతునే
