సరస్వతి నాదం-గాంధేయవాదం .వచన కవితా సౌరభం : కవీశ్వర్ 01 .10 . 2022
సరస్వతి నాదం-గాంధేయవాదం .వచన కవితా సౌరభం : కవీశ్వర్ 01 .10 . 2022
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అంశం ; సరస్వతి నాదం-గాంధేయవాదం .
వచన కవితా సౌరభం : కవీశ్వర్
01 . 10 . 2022
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సచ్చరితల ప్రవాహమునకు ఆద్యురాలు మాత సరస్వతి
తలచినకొలది ఉపయుక్తమైన ఆలోచనల ప్రవాహం ఆమెదే
ప్రతిజీవి ఉత్క్రుష్ఠ జీవితానికి ధీశాలి జ్ఞాన ప్రవాహామే ఈ వాగ్దేవి
జీవితాంతము వరకు ఆమె కృపచే తగిన లక్ష్యాలను చేరుతున్నామే
దేశ స్వాతంత్య్ర సముపార్జన ఆలోచన కలిగిన జాతి పిత గాంధీగారు
దేశాభివృద్ధికి పాటుపడే మానవ విలువలను పాటించే సహృదయుడు
సత్యం, అహింస , స్వచ్ఛ మనస్సు , స్వచ్ఛత కలిగిన ఆశయ సాధకుడు
తన జీవితము తో , జీవనముతో సకల ప్రజలకు జీవిత గమ్య మార్గదర్శి
దక్షిణ ఆఫ్రికాలో కూడా జాతి వైరాన్ని తొలగింపజేసిన పరమ సాత్వికుడు
తన అమూల్యమైన రచనలను,విలువల విద్యలను అందించినభారత జాతికరత్నం
అన్నికాలాలలో అన్నియుగాలలో స్మరించదగిన నిరాడంబర మహోన్నత మహాత్ముడు
అందరు భారతీయులు కూడా వాటిని ఎల్లప్పుడూ స్మరించి , పాటించి తరించాలనే మనీషి
ఇలాంటి యోధులను మనకందించిన అక్షర కుసుమాల రాశి , జీవన చైతన్య జగద్ధాత్రి
మన భరతమాత ఆనందం తో పొంగిపొరలు తల్లి భారతికి విశేష సుమనమస్సుమాంజలి
నదీమ తల్లిగా ఇప్పుడలరాలుతున్న పరమ పావని , కాశ్మీర పురవాసిని అభివృద్ధి గాంచాలి.
లలితకళల,నాదనీరాజన సుపథగామిని,ఆదేవి కృప మనందరిపైవర్షించాలని అందరి కోరిక .
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
