ఉపాధ్యాయుని దృష్టి కోణం : వచన కవిత
ఉపాధ్యాయుని దృష్టి కోణం : వచన కవిత
ఉపాధ్యాయుని దృష్టి కోణం : వచన కవిత
కవీశ్వర్ : 17 . 09 . 2022 .
నిత్య విద్యార్థి యగుఉపాధ్యాయుడు అజ్ఞాన తిమిరాన్ని తొలగించే
తన విద్యార్థుల అభివృద్ధే తన జీవిత పరమావధే ధేయం గా
అందరి సహకార,సహయోగాలను నిరంతరమూ స్వీకరిస్తూ సవ్యంగా
విద్యార్థుల మంచినేకాంక్షించే గురువులకు వర్తమాన కాలంలో
ఉపాధ్యాయుని పరికల్పనలను విద్యార్థులచే అనుభవపూర్వకముతో
తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఇష్ట పూర్వకంగా చేయించి తమవంతు కృషి
అందింప జేసే ఉపాధ్యాయుడే మార్గదర్శి వీరందరికి సర్వకాలములందు
తానూ మారి ఇతరులను కూడా మార్చే అద్భుత హిమకర మహిమాన్వితుడే గురువు.
ఈ రోజుల్లో చాలా తక్కువమంది గురువు యొక్క అభివృద్ధిని , మంచిని కోరుకునే వారు
ఎక్కువభాగం పిల్లలు , వారి తల్లిదండ్రులు గురువులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని హరించే
పిల్లల, వారి తల్లిదండ్రుల అనుచిత ప్రవర్తన గురువుల పట్ల ఎక్కువ ఆవుతుంది దానివల్ల
వారి పిల్లల అభివృద్ధికి గొడ్డలిపెట్టు కదా ! ఎక్కడో జరిగిన సంఘటనలను అందరి గురువులకు
ఆపాదించడం ఎంతవరకు సమంజసం?
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం 5 . 10 . 2022 సందర్భంగా రాసిన వచన కవిత
