STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

ఒకరికొకరై ...

ఒకరికొకరై ...

1 min
298

రోజూ వేకువఝామునే కోడికూతకు

ఎవరు ముందుగా స్పందిస్తారో మొదలు

దినచర్యలో ప్రతిఘడియ

ఒకరికొకరిగా సాగించేదే దాంపత్యం .


భానునికిరణాలు భూమిని తాకగానే

మగనిచేతి కమ్మనికాఫీ త్రాగాలని భార్య .

పెరటిమొక్కలపై రాత్రంతా వాలిన

హిమబిందువులు వెలుగువేడికి

కరిగిపోయేవేళకు ఘుమఘుమలాడే

అల్పాహారంతో నోరూరించాలని ఆ భర్త .


ఇంతలో వచ్చే వార్తలను ఒకరు చూస్తోంటో

మరొకరు సమంగా తెలుసుకుంటూ .

అది కాగానే మరో ధారావాహికకు మార్చగా

మొదటివారు కనులనప్పగించుకుంటూ .


సంధ్యాసమయంలో విహారానికై వెళ్ళి

పూదోటలో హాయినిగొల్పే ఆటపాటలు .

స్నేహితుల ఆహ్వానాన్ని స్వీకరించి

అభిమానాన్ని పంచగా విందు వినోదాలు .


జాజిపరిమళాల గుభాళింపుతో

వెన్నెలవానలో కన్నకలల సాకారానికై

ఒకరిఒడిలో ఒకరు తలను వాల్చి

ఊసులను మనసారా విప్పిచెప్పుకుని .



Rate this content
Log in

Similar telugu poem from Thriller