ఒక విహారయాత్ర
ఒక విహారయాత్ర




వెళ్ళేది సొంత ఊరే
నా అనుకునే వాళ్లున్న ఊరే
ఉంటే అభిమానంగా అన్నం పెట్టే వాళ్లున్న ఊరే
ఎన్నెన్ని ప్రదేశాలు తిరిగినా
గొప్ప అనే మనుషుల్ని చూసినా
అవన్నీ దిగదుడుపే
పొట్ట చేత పట్టుకుని
వలస పోయిన కుటుంబాల తరువాతి తరాలకి
అసలైన మొదటి విహార యాత్ర
సొంత నేలపై అడుగు పెట్టినప్పుడే కదా
అలా కన్నార్పకుండా చెట్టూ చేమల్నీ చూస్తూ
విరిసిన పొద్దు తిరుగుడు పువ్వులతో పోటీ పడుతూ
నాలుగు జ్ఞాపకాలు గుండెలోనూ
ఇంకొన్ని బ్యాగులోనూ వేసుకుని
తిరుగు ప్రయాణం భారంగా సాగుతుంది
మనం అనుకున్నట్టు ఏ ప్రదేశం లేకపోయినా
అది అక్కడి వాళ్ళ నష్టం అని వదిలేస్తాం
మన ఊరు ఎలా అయినా బాగుండాలి
అని మనం ఎక్కడ ఉన్నా కోరుకుంటాం
నిజమే కదా
మీరు కోరుకోరా..