STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఒక రాఖీ

ఒక రాఖీ

1 min
271

గొడవలు గొప్పవేం కాదు

మనం గొడవపడడంలో ఆశ్చర్యమూ లేదు

బంధమంటూ ఉందనే నేను ధైర్యంగా ఉన్నాను

ఏదో ఒకరోజు అన్నవనే ఆప్యాయత నీలో కలుగుతుందనే నమ్మాను


రాష్ట్రాలు దాటాను

సముద్రాలను పలకరించాను

యదలో ఇంకా లోటు

నీకు కట్టాల్సిన రాఖీ 

నా ఇంట్లో ఉండిపోయింది

ప్రతి ఏడూ కొన్ని కన్నీళ్లను దానికి అద్ది

మరింత కొత్తగా మారుస్తున్నా


చాలా కాలం గడిచింది

ఇంతకూ మనం ఎందుకు మాట్లాడుకోవడం మానేసాం

నిజంగా అంత విలువైన విషయమా

పోనీ ఆ రాఖీ ఎక్కడైనా పడేద్దాం అనుకుంటున్నా

అంత ధైర్యం చాలట్లేదు..


Rate this content
Log in

Similar telugu poem from Abstract