STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

నిజం చెప్పనా నాన్న!

నిజం చెప్పనా నాన్న!

1 min
308

పది నెలలు పది వందల గ్రాములు 

మించిన బరువును..

క్షణమైనా పక్కన పెట్టక మోసే అమ్మకి

ఎలాగూ ఉంటుంది పాశం

భూమిని పడ్డ నన్ను చూసి

నీకేల కల్గే..అనిర్వచనీయ ఆత్మీయ

అనుభూతి!

ఆ అనుభూతే బంధం..

ఆ విడదీయలేని బంధం పేరే... నాన్న!


యేడాదంతయూ తన రొమ్మును

అమృత భాండాగారమ్ముగా మార్చి

పాలిచ్చిన అమ్మకెలాగూ ఉంటుంది ప్రేమ


మరి!

నా బుడి బుడి తడబడే అడుగులకు

ముద్దు ముద్దు మొద్దు మాటలకు

ఎంతో పొంగిపోయే పిచ్చి ప్రేమ మాత్రం

నీదే..నీదే.. కదా నాన్న!


జీవకోటికి ప్రాణమిచ్చిన సృష్టికర్తకు 

ఎంత బాధ్యతుంటుందో తెలియదు కానీ!

నాన్న!

నీ వేలు పట్టుకుని నడిచా మొన్న

నా భవితకు బంగారు బాట వేసావు నిన్న

నాకోసం చిన్న చిన్న అనదాలను సైతం

వదులుకున్న ఓ...నాన్న

నీ ముందు వెలుగునిచ్చే 

ఆ సూర్యుడు కూడా ఎంతో...చిన్న

నా కలలు నిజం చేయటంలో

నీ కన్నా ఎవరూ సాటి రారు నాన్న

ఇలా..

నా పట్ల నీ బాధ్యత ఆ భగవంతుడ్ని మించే

ఉంటుందనుటలో..అతిశయోక్తి లేదు నాన్న!


నిజం చెప్పనా నాన్న..

నువ్వు లేకుంటే నా జీవితం గుండు సున్న

అందుకే...

నీకు నా శిరస్సు వంచి ప్రణామం చేస్తున్న!


       ......రాజ్.....


Rate this content
Log in

Similar telugu poem from Action