నీలాకాశం
నీలాకాశం
అత్యంత అందంగాయున్నది
అమిత అనందాన్నియిస్తున్నది
వాతావరణం పిలుస్తున్నది
నీలిగగనం చూడమంటున్నది
పైకెత్తిశిరం తేలుతున్నాయి
తెల్లమబ్బులుతృప్తినిస్తున్నాయి
తిలకించువార్లకురంగునుతీసుకోమంటున్నది
ఆటలనుఆడుకోమంటున్నది
నీలివస్త్రంతీసుకెళ్ళమంటున్నది
బట్టలను కుట్టించుకోమంటున్నది
పక్షిలాఎగిరిరమ్మంటున్నది
నింగినంతా విహరించమంటున్నది
మేఘాలనెక్కి స్వారిచేయమంటున్నది
పరవశించి పొంగిపొమ్మంటుంది
ఆకాశం అద్భుతం కడురమ్యం ఖగోళం
