ఉంటుంది
ఉంటుంది
సమయానికి మర్యాదను..ఇవ్వవలసె ఉంటుంది..!
సమయానికి వేదికదిగి..వెళ్ళవలసె ఉంటుంది..!
కాలం ఒక శూలంలా..వెంటాడుతు ఉండులే..
ఎవరైనా ఎఱుకమీర..బ్రతకవలసె ఉంటుంది..!
గడిచిన ఏ క్షణమూ..రాదు తిరిగి తెలుసుగా..
ప్రస్తుతమున చిరునవ్వై..ఉండవలసె ఉంటుంది..!
కాలానికి ఎదురీదే..పనేంలేదు నేస్తమా..
కలుపుగోలు తనముతోటి..కదలవలసె ఉంటుంది..!
సమయమెంత విలువైనదొ..ఎవరెవరికి చెప్పాలి..
గంటకొట్టు లోపు తనై..జరగవలసి ఉంటుంది..!
కత్తులు నూరదు కాలం..ఎవరి బ్రతుకు వారిదే..
అనుభవ జ్ఞానం సాక్షిగ..ఎదగవలసె ఉంటుంది..!
