ఇష్టము
ఇష్టము
నీ పెదవుల మెఱుపులోన..ఉండిపోవుట ఇష్టము..!
నీ కోసం గులాబినై..పూసిపోవుట ఇష్టము..!
ఊరించే చిత్రసీమ..జరుగుతున్న కలయేను..
నీతలపుల వానలోన..కాలిపోవుట ఇష్టము..!
మధువేదో పనేలేని..మత్తుమందు దొరికెలే..
నిను చూస్తూ ఈ నేనే..కరిగిపోవుట ఇష్టము..!
చెలిమికన్న జగతినడుపు..సూత్రమేదొ ఓచెలీ..
చెప్పకనే మౌనముతో..కలిసిపోవుట ఇష్టము..!
మదిదోచిన గజదొంగవు..నీవన్నది తెలిసెలే..
ఈ పల్లకి సాక్షిగనే..రాలిపోవుట ఇష్టము..!
లేనిపోని యాతనలకు..సెలవెలాగ అందెనో..
మాటలలో పెట్టకనే..పెట్టిపోవుట ఇష్టము..!
