మనసాగదు
మనసాగదు
ఆగిపోయె రేయి సఖా..నీవురాక తెలవారదు..!
అమావాస్య మాటాడదు..నీవొస్తే మనసాగదు..!
పిలువలేను నీ పేరును..గాలి మోసుకెళ్ళునెటో..
మోసమేమి జరిగేనో..క్షణమైనా కనుమలగదు..!
హాయి ఎలా ఉంటుందో..గుండె కాస్త ఆగినంత..
ఈ మౌనం తియ్యనిదే..ఎంతకూ తలుపు తియ్యదు..!
ప్రేమకెంత నిదానమో..లోలోపల వెన్నెలలా..
గొంతుదాటి ఒకపాటగ..పాడుకోగ అరె లొంగదు..!
ఈ వసంత మాధురినే..మోయలేను కలనైనా..
నా లోపలి జాతరను..చూపుటెలానో తెలియదు..!
జ్ఞాపకాల చేమంతుల..వానకన్న మాయేదో..
యాగమేదొ జరుగుతోంది..రససిద్ధికి తెఱదించదు..!
