పెళ్ళి రోజు
పెళ్ళి రోజు
మనసులు పెనవేసుకునే..మంచిరోజు పెళ్ళిరోజు..!
జీవితాలు పండించగ..మేటిరోజు పెళ్ళిరోజు..!
సంప్రదాయ రక్షణలో..పాలు పంచుకోవాలని..
తెలుపక తెలిపే కలిపే..తీపిరోజు పెళ్ళిరోజు..!
జన్మకలల సాకారత..జరిగేందుకు ప్రాతిపదిక..
సావధాన మంత్రపూత..పాడిరోజు పెళ్ళిరోజు..!
నిత్యప్రేమ రాగాలకు..అన్నప్రాసన జరిగేను..
సంసారపు వేడుకలకు..ఆదిరోజు పెళ్ళిరోజు..!
ఏడడుగుల మూడుముళ్ళ..ప్రాధాన్యత ఎంతటిదో..
సవివరముగ గ్రహించగా..మనవిరోజు పెళ్ళిరోజు..!
విరహపుగది పునాదులను..కదిలించే దారిచూప..
సుముహూర్తం సూచించే..దాడిరోజు పెళ్ళిరోజు..!
