జన్మాలు
జన్మాలు
కోరికలు సఖులుగా..గడచునే జన్మాలు..!?
బంధాల ఊయలన..ఇగురునే జన్మాలు..!?
ఒక మధుర గీతియే..జీవితం తెలియకే..
గంధాల ఊబిలో..చిక్కునే జన్మాలు..!?
నిజమౌన గగనమది..నీ అంతరంగమే..
మాటలకు లొంగకే..తీరునే జన్మాలు..!?
ఆటలాడే గాలి..ఆగితే శాంతమే..
చీకటుల పొందులో..చెల్లునే జన్మాలు..!?
భావనల అద్దమే..బ్రతుకైన వేడుకన..
రాగాల ముసుగులో..రాలునే జన్మాలు..!?
ఆరాట పోరాట..చిత్రాల కావ్యమే..
మనసుతో సమరాన..తప్పునే జన్మాలు..!?
