STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

గమ్మత్తుగా

గమ్మత్తుగా

1 min
3



చేయి వదిలి గుండెవెనుక..చేరినావు గమ్మత్తుగ..! 
చెరుపరాని చిరునవ్వై..మిగిలినావు గమ్మత్తుగ..! 

మాయమత్తు వదిలించిన..నెరజాణవె ఓ చెలియా..
కల్లోలపు కథలు సరిగ..కాల్చినావు గమ్మత్తుగ..! 

వేదిక దిగి వెళిపోగా..తొందరేల పడితివోయి.. 
ఈ మనసుకు తీపి చితిని..పేర్చినావు గమ్మత్తుగ..! 

పండుటాకులై రాలే..కోరికలను చూస్తున్నా.. 
ప్రశాంతతా తీరమేదొ..చేర్చినావు గమ్మత్తుగ..! 

మేను 'నేను' కాదన్నది..బోధపడెను నీ దయతో.. 
ఆనందపు వైభోగము..ఇచ్చినావు గమ్మత్తుగ..! 

ఈ కన్నులు తెరచిననూ..మూసిననూ నీవె చెలీ.. 
ఆరాధన కతీతముగ..నిలిపినావు గమ్మత్తుగ..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics